DEVOTIONAL

ఆర్జిత సేవా టికెట్లు కోటా విడుద‌ల

Share it with your family & friends

ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమ‌ల – శ్రీ‌వారి భ‌క్త బాంధ‌వులకు తీపి క‌బురు చెప్పింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ). ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించు కునేందుకు వ‌స్తుంటారు. ఆయ‌నను ద‌ర్శించుకుంటే స‌క‌ల ఐశ్వ‌ర్యాలు క‌లుగుతాయ‌ని, కోరిన కోర్కెలు తీరుతాయ‌ని, క‌ష్టాలు తొల‌గి పోతాయ‌ని న‌మ్మ‌కం.

ఇందులో భాగంగా టీటీడీ ప్ర‌తి సారి స్వామి వారికి సంబంధించి సేవ‌ల‌లో పాల్గొనే అవ‌కాశాన్ని క‌ల్పిస్తూ వ‌స్తోంది భ‌క్తుల కోసం. ఇందులో భాగంగా గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే జూన్ నెల‌కు సంబంధించి శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపింది.

వీటిని ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇవ్వాళ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీ పాలంకార సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించింది.

జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు గాను ఈ టికెట్ల కోటాను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. భ‌క్త బాంధ‌వులు కేవ‌లం టీటీటీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే న‌మోదు చేసుకోవాల‌ని సూచించింది.