NEWSNATIONAL

అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్

Share it with your family & friends

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసు

న్యూఢిల్లీ – పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇండియా కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను కేంద్ర ద‌ర్యాప్థు సంస్థ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆయ‌న‌ను త‌న నివాసంలో ప్ర‌శ్నించింది. అనంత‌రం అరెస్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో దేశ రాజ‌ధానిలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది ఈ అరెస్ట్ వ్య‌వ‌హారం.

దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 17 మందిని అరెస్ట్ చేసింది ఈడీ. తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దీనిపై పెద్ద రాద్దాంతం చెల‌రేగింది.

కేవ‌లం క‌క్ష సాధింపులో భాగంగానే త‌నను అరెస్ట్ చేశారంటూ క‌విత ఆరోపించింది. ఆపై కోర్టును ఆశ్ర‌యించింది. ఇదే స‌మ‌యంలో క‌విత‌, అరవింద్ కేజ్రీవాల్ క‌లిసి ఢిల్లీ లిక్కర్ పాల‌సీని మార్చారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ. మొత్తంగా ఆప్ ఇప్పుడు ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డి పోయింది. కాగా కేజ్రీవాల్ అరెస్ట్ అక్ర‌మమంటూ విప‌క్ష‌లు మండి ప‌డుతున్నాయి.