మాజీ సీఎం సదానంద గౌడ గుడ్ బై
సదానంద గౌడ సంచలన ప్రకటన
కర్ణాటక – రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు , మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. చిల్లర పాలిటిక్స్ చేయడం తన వల్ల కాదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ప్రకటించిన ఎంపీ స్థానాలలో తనకు చోటు దక్కక పోవడంపై తీవ్ర ఆవేదన చెందారు. ఆయన బెంగాళూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే పార్టీ మొండి చేయి చూపించింది.
అయితే తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్లు వచ్చాయని సంచలన ప్రకటన చేశారు డీవీ సదానంద గౌడ. కానీ తాను ఏ పార్టీలోకి వెళ్లబోనంటూ స్పష్టం చేశారు. బీజేపీలోనే ఉంటానని, పార్టీని ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై నిప్పులు చెరిగారు. బీజేపీ పార్టీ కాదని ఆయన కుటుంబమే డామినేట్ చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు సదానంద గౌడ.