ఢిల్లీ సీఎం అరెస్ట్ అప్రజాస్వామికం
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కర్ణాటక – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. మోదీ కొలువు తీరాక దేశంలో ప్రతిపక్ష పార్టీలను, నేతలను కావాలని టార్గెట్ చేస్తూ వచ్చారని ఆరోపించారు డీకే శివకుమార్.
ఈ దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సరే అక్రమ మార్గంలో గెలవాలని మోదీ పరివారం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కానీ వారికి అంత సీన్ లేదన్నారు. మీడియాను మ్యానేజ్ చేస్తూ , ప్రజలను నిట్ట నిలువునా మోసం చేస్తున్న బీజేపీకి, మోదీకి ఈసారి ఎన్నికల్లో శృంగ భంగం తప్పదన్నారు డీకే శివకుమార్.
తాజాగా ఆదాయపు పన్ను సమస్యల ముసుగులో తమ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందన్నారు. రాహుల్ గాంధి చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర తో భారీ ఎత్తున ఆదరణ లభించిందని తెలిపారు. దీనిని జీర్ణించు కోలేక మోదీ ఇలాంటి చవకబారు ట్రిక్కులు ప్లే చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు.