మోదీపై ఫైర్ బీజేపీపై సెటైర్
వైఎస్ షర్మొల రెడ్డి కామెంట్స్
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీపై. దేశంలో మోదీ నేతృత్వంలోని కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు.
కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుతున్నారంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
బీజేపీ కావాలని నేర పూరితమైన కుట్రలకు తెర లేపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు కేవలం నెల మాత్రమే సమయం ఉందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా తన దుర్బుద్దిని బయట పెట్టిందని ఫైర్ అయ్యారు.
ఈ దేశంలో కేవలం కులం పేరుతో, మతం పేరుతో ఓట్ల రాజకీయం చేసే బీజేపీకి నిజాలు, వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం లేదని మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. రాజ్యాంగానికి విరుద్దంగా ప్రజాస్వామ్యానికి చేటు తీసుకు వచ్చేలా మోదీ సర్కార్ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ఏపీ పీసీసీ చీఫ్.
దేశంలోని 143 కోట్ల మంది ప్రజలు తప్పకుండా ఆలోచించాలని, విలువైన ఓటుతో సమాధానం చెప్పాలని ఆమె కోరారు.