ప్రధాని భద్రతపై నివేదిక ఇవ్వండి
ఏపీ సీఈవోను ఆదేశించిన ఈసీ
అమరావతి – కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా గళం సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్బంగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుందని కూటమి నేతలు ఆరోపించారు. ఈ మేరకు పల్నాడు ఎస్పీపై ఈసీకి ఫిర్యాదు చేశారు.
దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి చోటు చేసుకున్న ఘటనపై వివరాలు ఇవ్వాలని శుక్రవారం ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. కూటమి నేతలు చేసిన ఫిర్యాదుపై స్పందించింది. అంతకు ముందు సుదీర్ఘ లేఖ రాసింది కూటమి.
పీఎం టూర్ కు సంబంధించి చోటు చేసుకున్న పరిస్థితులు, భద్రతా వైఫల్యానికి గల కారణాలు ఏమిటనే దానిపై పూర్తి నివేదికను వెంటనే ఇవ్వాలని ఈసీ సీఈవోను ఆదేశించారు. పీఎం భద్రతా వైఫల్యం చోటు చేసుకోలేదని, ఇదంతా కావాలని ఆడుతున్న నాటకమంటూ అధికార వైసీపీ నేతలు ఆరోపించారు.