NEWSTELANGANA

ఎమ్మెల్సీ క‌విత‌కు బెయిల్ ఇవ్వ‌లేం

Share it with your family & friends

బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచ‌లంన సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు బిగ్ షాక్ త‌గిలింది. మ‌ద్యం కుంభ‌కోణంలో త‌న‌ను అరెస్ట్ చేయ‌డాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇదంతా క‌క్ష సాధింపు ధోర‌ణితో చేసిందేన‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

త‌న అరెస్ట్ అక్ర‌మ‌మ‌ని, తాను ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని, తాను మ‌నీ లాండ‌రింగ్ చేయ‌లేద‌ని, తాను అమాయ‌కురాలిన‌ని, ఈడీ క‌వాల‌ని త‌నను ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని, థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తున్నారంటూ ఆరోపించింది. అంతే కాదు ఒక బాధ్య‌త క‌లిగిన మ‌హిళ‌నైన త‌న‌కు కొన్ని హ‌క్కులు ఉంటాయ‌ని, ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

శుక్ర‌వారం క‌విత వేసిన పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. రాజ‌కీయ నాయ‌కులు ప‌దే ప‌దే బెయిల్ కోసం కోర్టును ఆశ్ర‌యించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో అన్ని దారులు మూసుకు పోయిన‌ట్లేన‌ని టాక్.