NEWSNATIONAL

త‌మిళ‌నాడు ఎంపీ అభ్య‌ర్థులు ఖ‌రారు

Share it with your family & friends

కోయంబ‌త్తూరు నుంచి కె. అన్నామ‌లై

త‌మిళనాడు – పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే అధిష్టానం బ‌రిలో ఉండేందుకు తొలి విడ‌త‌గా 195 సీట్ల‌ను ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా ప్ర‌క‌టించారు . తాజాగా రెండో జాబితాలో మ‌రికొంద‌రిని చేర్చారు.

శుక్ర‌వారం ద‌క్షిణాదిన పాగా వేసేందుకు గాను యువ నాయ‌కుడు కె. అన్నామ‌లై సార‌థ్యంలోని బీజేపీ ఎలాగైనా సీట్ల‌ను కైవ‌సం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగానే భావ సారూప్య‌త క‌లిగిన నాయ‌కులు, సంస్థ‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. వారితో పొత్తు ఖ‌రారు చేసుకుంది బీజేపీ.

ప్ర‌స్తుతం బీజేపీ త‌మిళ‌నాడులో పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. కోయంబ‌త్తూరు నుండి బీజేపీ చీఫ్ కె. అన్నామ‌లైని ఎంపిక చేసింది. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి గుడ్ బై కాషాయ కండువా క‌ప్పుకున్న త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ చెన్నై సౌత్ అభ్య‌ర్థినిగా బ‌రిలోకి దింపింది.

ఇక చెన్నై సెంట్ర‌ల్ లో వినోద్ పి సెల్వం పోటీ చేయ‌నున్నారు. క‌న్యాకుమారి నుంచి ఎప్ప‌టి లాగే పొన్ రాధాకృష్ణ‌న్ బ‌రిలో ఉండ‌నున్నారు. నీల‌గిరి నుంచి ఎల్ మురుగ‌న్ పోటీ చేస్తార‌ని బీజేపీ హై క‌మాండ్ స్ప‌ష్టం చేసింది.