జంపింగ్ జిలానీలకు ఛాన్స్
ఐదుగురులో మగ్గురికి అవకాశం
హైదరాబాద్ – నిన్నటి దాకా బీఆర్ఎస్ ను ఏకి పారేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ తను కూడా అదే బాటలో నడుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరిన వారిలో ముగ్గురికి ఎంపీలుగా పోటీ చేసేందుకు అవకాశం దక్కించు కోవడం విస్తు పోయేలా చేసింది.
పట్టుమని 120 రోజులు కాలేదు అప్పుడే సీఎం రాజకీయాలకు తెర లేపారు. ఎవరు గెలుస్తారో తెలియదు కానీ రాజకీయం మరింత వేడి రాజుకుంది. పార్టీలో ముందు నుంచి నమ్ముకుని ఉన్న వారిని పరిగణలోకి తీసుకోలేదు. దీనిపై కొందరు కినుక వహిస్తున్నారు.
మరో వైపు సామాజిక వర్గాలను పక్కన పెట్టారన్న ఆరోపణలు లేక పోలేదు. ఈ తరుణంలో ఆలంపూర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన సంపత్ ఎంపీ సీటు కోసం చివరి దాకా ప్రయత్నం చేశారు. కానీ మల్లు రవికి ఛాన్స్ దక్కింది. ఆయనకే సీటు ఖరారైంది. ఆయన సోదరుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికి ఒకే కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తమ్ తో పాటు భార్య, కోమటి రెడ్డి బ్రదర్స్ చెప్పుకుంటూ పోతే చాంతాడంత చరిత్ర ఉంది.
ఇది పక్కన పెడితే ఎంపీ జాబితా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. వాటిలో నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ , చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని ప్రకటించింది ఏఐసీసీ. ఇందులో ముగ్గురు నేతలు జంపింగ్ జిలానీలు కావడం విశేషం.