మోదీ బాండ్ల సంగతేంటి
ఆకునూరి మురళి ఫైర్
హైదరాబాద్ – ఎస్డీఎఫ్ చీఫ్ ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత, కేజ్రీవాల్ లను అరెస్ట్ చేయడం అనేది ఓ ప్లాన్ ప్రకారం చేశారంటూ ఆరోపించారు. ఆ ఇద్దరు ఉన్నారా లేదా అనేది కోర్టులో తేలుతుందన్నారు. కానీ దేశంలోనే 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో ఎన్నడూ లేనంతగా ఎలక్టోరల్ బాండ్ల పేరుతో భారీ ఎత్తున దోపిడీ చోటు చేసుకుందని ఆరోపించారు ఆకునూరి మురళి.
గత ఏడాది నుంచి జరుగుతోందని ఈ కేసు. మరి ఇప్పుడు ఎందుకని అరెస్ట్ చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కవిత అరెస్ట్ సక్రమేనని పేర్కొన్నారు . ఇప్పటి వరకు ఎవరు ఎవరితో బేరసారాలు చేశారో కూడా తెలియాలన్నారు ఆకునూరి మురళి.
క్విడ్ ప్రో కో ద్వారా బీజేపీ బహిరంగంగానే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను విరాళాల రూపేణా వసూలు చేసిందని ఆరోపించారు . ఆ పార్టీకి ఎవరెవరు, ఏయే సంస్థలు ఎన్ని కోట్లు ఇచ్చాయో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని ఆపేందుకు అంతకు మించి తమ విరాళాల స్కామ్ బయటకు పొక్కకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నం తప్ప మరోటి లేదన్నారు.