కోర్టులు మౌనం వహిస్తే ఎలా..?
ఆవేదన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యయువత దేశంగా పేరు పొందిన భారత దేశంలో ఇప్పుడు రాచరికం , మతం రాజ్యం ఏలుతున్నాయంటూ మండిపడ్డారు. ఇది పూర్తిగా చట్ట విరుద్దమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు లేకుండా ఒకే ఒక్క పార్టీ ఉండాలని అనుకోవడం డెమోక్రసీ అనిపించు కోదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
ఇదే సమయంలో ప్రజాస్వామ్య చట్రాన్ని పరిరక్షించాల్సిన సంస్థలు దేశంలో ఉన్నా, అవేవీ ఇప్పుడు పని చేయడం లేదంటూ వాపోయారు. భారత రాజ్యాంగాన్ని సంరక్షించాల్సిన న్యాయ స్థానాలు ఇప్పుడు ఎందుకు మౌనం వహించాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.
ఇక నాలుగో స్తంభంగా భావిస్తూ వస్తున్న మీడియా కూడా మౌనంగా ఉండి పోయిందని, కేవలం మోదీ తప్ప ఇంకేదీ ఈ దేశంలో ఇవ్వడం లేదంటూ పేర్కొన్నారు.