నరసింహుడి సన్నిధిలో నారా
రాష్ట్రం బాగుండాలని కోరుకున్నా
నెల్లూరు జిల్లా – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో అత్యంత పేరు పొందిన ఆలయాన్ని సందర్శించారు. ఈ ప్రసిద్ద పుణ్య క్షేత్రం వెంకటగిరిలో కొలువై ఉంది. పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు.
అనంతరం బాబుకు పూజారులు మంగళా శాసనాలు అందజేశారు. ఆయనతో పూజలు చేయించారు. ఈ సందర్బంగా స్వామి వారిని దర్శించున్న అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. అడవులు, కొండల మధ్య కొలువైన స్వామి వారిని దర్శించు కోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.
ప్రజల కోసం పోరాడే శక్తిని, పని చేసే సామర్థ్యాన్ని ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి, ప్రజలకు అంతా మంచి జరగాలని ప్రార్థించానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.