మాస్కోలో ఉగ్రమూకల దాడి
ఇది తమ పనేనని ప్రకటించిన ఐసిస్
రష్యా – ఉగ్రమూకలు విధ్వంసం సృష్టించారు. భారీ ఎత్తున దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన రష్యా దేశ రాజధాని మాస్కో నగరంలోని ఉగ్ర దాడి చోటు చే\సుకుంది. సాయుధలైన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. కన్సర్ట్ హాల్ పై పెద్ద ఎత్తున బాంబులు విసిరినట్లు సమాచారం.
దీంతో అక్కడికక్కడే పలువురు చని పోయినట్లు రష్యా ధ్రువీకరించింది. ఇదిలా ఉండగా రష్యా ప్రభుత్వం ఉగ్రవాద దాడిగా ప్రకటించింది. ముందుగా ఎవరికీ కనిపించకుండా దుస్తులు ధరించారు ఉగ్రవాదులు. వారు భవనంలోకి ప్రవేశించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ దాడికి దిగినట్లు భావిస్తోంది రష్యా.
ఎక్కడ చూసినా కన్సర్ట్ హాలులో భయానక వాతావరణం నెలకొంది. 100 మందికి పైగా బాధితులను చికిత్స నిమిత్తం తరలించారు. అగ్ని మాపక సిబ్బందితో పాటు రష్యా ఆర్మీ అక్కడికి చేరుకుంది. ఇదిలా ఉండగా ఇంకా లిఫ్టింగ్ పరికరాలతో భవనం పై కప్పు నుండి ప్రజలను రక్షించే పని కొనసాగుతోంది.