NEWSTELANGANA

సీజేఐకి ఆకునూరి హ్యాట్సాఫ్

Share it with your family & friends

సంచ‌ల‌న తీర్పుల‌తో రికార్డ్

హైద‌రాబాద్ – సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫోర‌మ్ (ఎస్డీఎఫ్‌) క‌న్వీన‌ర్ ఆకునూరి ముర‌ళి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ప్ర‌త్యేకంగా భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ గురించి ప్ర‌స్తావించారు.

ఈ దేశంలో విల‌క్ష‌ణ‌మైన తీర్పుల‌తో చ‌ర్చనీయాంశంగా మారార‌ని పేర్కొన్నారు. ప్ర‌త్యేకించి ఇటీవ‌ల సుప్రీంకోర్టు కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ స‌ర్కార్ కు దిమ్మ తిరిగేలా షాక్ ఇస్తూ తీర్పులు వెలువ‌రించార‌ని గుర్తు చేశారు ఆకునూరి ముర‌ళి.

ప్ర‌ధానంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం విష‌యంలో , ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌కంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌ని, స‌ర్వ స్వ‌తంత్రంగా ఉండాల్సిన వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేశార‌ని మండిప‌డిన విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా ఆకునూరి ముర‌ళి ప్ర‌స్తావించారు.

ఇదే స‌మ‌యంలో తాజాగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కోర్టు ఇచ్చిన తీర్పు. సీజేఐ చంద్ర‌చూడ్ సార‌థ్యంలోని ధ‌ర్మాస‌నం కీల‌క తీర్పు వెలువ‌రించింది. ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్య‌వ‌హారాన్ని బ‌ట్ట బ‌య‌లు చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారంటూ కితాబు ఇచ్చారు ఆకునూరి ముర‌ళి.

రాజ‌కీయ పార్టీలకు వ్య‌క్తులు, కంపెనీలు, సంస్థ‌లు ఎన్నెన్ని డ‌బ్బుల‌ను విరాళాల రూపేణా ఇచ్చారో స్ప‌ష్టం చేయాల‌ని ఎస్బీఐని ఆదేశించింది కోర్టు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న తీర్పు చెప్పిన సీజేఐకి కితాబు ఇచ్చారు ఎస్డీఎఫ్ చీఫ్ ఆకునూరి ముర‌ళి.