NEWSNATIONAL

బీజేపీలో చేరితే చ‌ర్య‌లుండవు

Share it with your family & friends

ప్ర‌శాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్

న్యూఢిల్లీ – భార‌తీయ ఎన్నిక‌ల స్ట్రాట‌జిస్ట్ , ఐపాక్ సంస్థ ఫౌండ‌ర్ ప్ర‌శాంత్ కిషోర్ వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీపై సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న వారు బీజేపీలో చేరితే చ‌ర్య‌లు ఉండ‌వ‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌శాంత్ కిషోర్.

రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి బ‌లం పెరుగుతోంద‌ని కానీ మిగ‌తా పార్టీల‌తో కూడిన ఇండియా కూట‌మికి స‌రైన దిశా నిర్దేశం చేయ‌క పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌ని పేర్కొన్నారు. మొన్న‌టికి మొన్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ప్రశాంత్ కిషోర్.

రాహుల్ గాంధీ దేశంలో విద్వేషాలు, కులం, మ‌తం, నిరుద్యోగం గురించి ప్ర‌స్తావిస్తున్నార‌ని కానీ ప్ర‌ధాన‌మంత్రి మాత్రం దేశాభివృద్ది గురించి ఫోక‌స్ పెట్టార‌ని ఈ రెండింటి మ‌ధ్య వ్య‌త్యాస‌మే ప్ర‌జ‌ల‌ను ఆలోచింప చేసేలా చేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌శాంత్ కిషోర్.

ఇదిలా ఉండ‌గా భార‌తీయ ఎన్నిక‌ల స్ట్రాట‌జిస్ట్ చేసిన తాజా కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. బీజేపీలో చేరితే కేసులు ఉండ‌వ‌ని చెప్ప‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.