శివ రాజ్ కుమార్ పై ఫిర్యాదు
తన భార్య కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్
కర్ణాటక – ప్రముఖ నటుడు శివ రాజ్ కుమార్ పై భారతీయ జనతా పార్టీ కి చెందిన యువ మోర్చా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనికి కారణం ఏమిటంటే ఆయన భార్య కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా ఉన్నారని, ప్రచారం కూడా చేస్తోందని పేర్కొంది.
ఇదిలా ఉండగా శివ రాజ్ కుమార్ సినిమాలపై నిషేధం విధించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కి ఫిర్యాదు చేసింది. యువ మోర్చా లేఖ అందజేసింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలా వద్దా అనే దానిపై ఆలోచిస్తామని సీవోఈ ఈ సందర్బంగా తెలిపారు.
ఇదిలా ఉండగా కన్నడ సినీ పరిశ్రమలో కంఠీరవ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. శివ రాజ్ కుమార్ తనయుడు చని పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఆయన చని పోయి మూడేళ్లు కావస్తోంది. ఇదే సమయంలో డీకే శివకుమార్ తో దగ్గరి అనుబంధం ఉంది శివ రాజ్ కుమార్ కుటుంబానికి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం శివ రాజ్ కుమార్ భార్య కీలకంగా మారారు.