సీఎం..ఎమ్మెల్సీ అరెస్ట్ అక్రమం
వాపోయిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తన కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడారు కేసీఆర్.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా మిగిలి పోతుందని స్పష్టం చేశారు. దేశంలో ప్రతిపక్షాలను, ప్రశ్నించే వారిని నామ రూపాలు లేకుండా చేసేందుకే అరెస్ట్ ల పర్వానికి తెర తీశారంటూ ధ్వజమెత్తారు కేసీఆర్. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
కేంద్రం దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీలను కంట్రోల్ పెట్టుకుని దాడులు, సోదాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరెస్ట్ ల వ్యవహారాన్ని దేశ ప్రజలంతా చూస్తున్నారని ఈ విషయం మోదీ, షా గమనించాలని స్పష్టం చేశారు. పావులుగా వాడుకోవడం మానుకోవాలని కేసీఆర్ సూచించారు.
బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను బీఆర్ఎస్ బేషరతుగా ఖండిస్తున్నదని స్పష్టం చేశారు.