NEWSTELANGANA

బీజేపీ..బీఆర్ఎస్ ‘మెఘా’ బంధం

Share it with your family & friends

రాజ‌కీయ పార్టీల‌కు భారీగా విరాళాలు

హైద‌రాబాద్ – సుప్రీంకోర్టు దెబ్బ‌కు అవినీతి ప‌రులు, సంస్థ‌లు, కంపెనీల గురించి దిమ్మ తిరిగే వాస్త‌వాలు వెలుగు చూస్తున్నాయి. సీజేఐ జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ ఇచ్చిన తీర్పు సంచ‌ల‌నంగా మారింది. ఎల‌క్టోర‌ల్ బాండ్ల పేరుతో అడ్డ‌గోలు దందాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీజేఐ. ఇక నుంచి బాండ్ల రూపేణా డ‌బ్బుల‌ను తీసుకోవ‌ద్దంటూ ఆదేశించింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ద‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా బ‌డా బాబులు ఎలా రాజ‌కీయ పార్టీల‌కు డ‌బ్బుల‌ను విరాళాలుగా ఇచ్చారో కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఎస్బీఐ అందించిన వివ‌రాలు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించింది. ఇందులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మేఘా కృష్ణా రెడ్డికి చెందిన మేఘా ఇంజ‌నీరింగ్ , ఇన్ ఫ్రా కంపెనీ వార్త‌ల్లో నిలిచింది.

ఈ కంపెనీ ఏకంగా అన్ని పార్టీల‌కు విరాళాలు స‌మ‌కూర్చింది. ఇందులో అత్య‌ధిక డ‌బ్బుల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీకి అంద‌జేశారు కృష్ణా రెడ్డి. ఏకంగా ఆ పార్టీకి రూ. 548 కోట్లు అంద‌జేశారు. కేసీఆర్ సార‌థ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి రూ. 195 కోట్లు, త‌మిళ‌నాడులో కొలువు తీరిన డీఎంకే పార్టీకి రూ. 85 కోట్లు, జ‌గ‌న్ రెడ్డి సార‌థ్యంలోని వైసీపీకి రూ. 37 కోట్లు, తెలుగుదేశం పార్టీకి రూ. 28 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి రూ. 18 కోట్లు, జ‌న‌సేన పార్టీకి రూ. 4 కోట్లు విరాళాల రూపేణా ఇచ్చింది.