కేజ్రీవాల్ బయటకు వస్తారు
సునీతా కేజ్రీవాల్ సందేశం
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఈడీ ఆధీనంలో ఉన్నారు. ఆయనను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో మరొకరు మాజీ సీఎం కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ.
ఇద్దరిని తమ కస్టడీలోకి ఇవ్వాలని కోరింది కోర్టును. తాజాగా హైదరాబాద్ లో కవిత బంధువులపై సోదాలు, దాడులు చేపట్టింది. ఇదిలా ఉండగా అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉన్నా లేక బయట ఉన్నా దేశం కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.
ఇదే విషయాన్ని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ వీడియో సందేశాన్ని వినిపించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. దేశాన్ని బలహీన పరిచేందుకు అనేక శక్తులు లోపలా, బయటా పని చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శక్తులను గుర్తించి ఓడించాలని పిలుపునిచ్చారు. తనను ఎక్కువ కాలం ఉంచే జైలు ఈ దేశంలో లేనే లేదని కుండ బద్దలు కొట్టారు సునీతా కేజ్రీవాల్.