కవితకు షాక్ కస్టడీ పొడిగింపు
మరో మూడు రోజులు గడువు
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది కోర్టు. ఆమెను కోర్టులో హాజరు పర్చడంతో ఏడు రోజుల కస్టడీ ఇచ్చింది. ఈనెల 23తో కస్టడీ ముగియడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మరోసారి కవితకు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించింది. రూ. 100 కోట్ల ముడుపులు ఈమె ద్వారానే ఆప్ కు అందాయని ఆరోపించింది. ఇందుకు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
ఇదే సమయంలో ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం 17 మందిని అరెస్ట్ చేశామని చెప్పింది. కవితను విచారించిన అనంతరం పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేశామని చెప్పింది ఈడీ. ఇదే సమయంలో మొత్తం ఢిల్లీ కుంభ కోణంలో కీలకమైన పాత్ర పోషించింది మాత్రం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కల్వకుంట్ల కవిత ఉన్నారని కుండ బద్దలు కొట్టింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి శనివారం విచారణ చేపట్టింది రాస్ ఎవెన్యూ కోర్టులో. ఈ మేరకు ఇంకా కేసు పూర్తి కాలేదని, అందుకే కవితను కస్టడీకి ఇవ్వాలని కోరింది ఈడీ. ఈ మేరకు జడ్జి మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ తీర్పు చెప్పారు.