ఈడీపై కన్నెర్ర కోర్టులో తేల్చుకుంటా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామెంట్స్
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోలుకోలేని షాక్ తగిలింది. శనివారం ఆమెను కోర్టులో హాజరు పర్చడంతో మూడు రోజుల పాటు కస్టడీ విధించింది. దీంతో బయటకు రావాలని కలలు కన్న కవితను విస్తు పోయేలా చేసింది ఈ తీర్పు.
కోర్టు నుండి బయటకు వచ్చిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్ పై భగ్గుమన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆరోపించారు. దీనికి సంబంధించి న్యాయ స్థానంలో పోరాటం చేస్తానని ప్రకటించారు.
ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదన్నారు కల్వకుంట్ల కవిత. అడిగిన వివరాలే తిరిగి తిరిగి తనను అడుగుతున్నారని వాపోయారు. ఏది ఏమైనా కావాలని కక్ష పూరితంగా తనను ఇరికించారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు కల్వకుంట్ల కవిత.
తన అరెస్ట్ పూర్తిగా అక్రమమని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కరివేపాకులా వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు.