జేపీ నడ్డాను అరెస్ట్ చేయాలి
నిప్పులు చెరిగిన ఆప్ మంత్రి
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ బండారం ఎలక్టోరల్ బాండ్ల వివరాలతో బయట పడిందని ఎద్దేవా చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిషి. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ రెడ్డి కి బెయిల్ ఇవ్వడం వెనుక క్విడ్ ప్రో చోటు చేసుకుందని మండిపడ్డారు.
దేశంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని కుట్ర పన్నుతోందంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, శరత్ రెడ్డిల మనీ ట్రయల్ దేశం ముందు బయట పడిందన్నారు. శరత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత డీల్ కుదిరిందని, ఇందులో భాగంగానే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డబ్బులను విరాళంగా బీజేపీకి అందజేశారంటూ ఆరోపించారు అతిషి.
లోపాయికారి ఒప్పందం మేరకు తొలి విడత రూ. 4.5 కోట్లు ఇచ్చారని , ఆ తర్వాత రూ. 55 కోట్లు బీజేపీకి అందజేశారని ఆరోపించారు. మొత్తంగా మనీ జాడ ఇప్పుడు బహిరంగంగా వెల్లడైందని మండిపడ్డారు మంత్రి. ఇందుకు సంబంధించి బాధ్యత వహిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అతిషి.