కన్నడ నాట కాంగ్రెస్ దే గెలుపు
పిలుపునిచ్చిన డీకే శివకుమార్
కర్ణాటక – కన్నడ నాట కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు కేపీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. శనివారం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హామీ పథకాల అమలు కమిటీ చైర్మన్లు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి డీకే శివకుమార్ ప్రసంగించారు.
దేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుతం ప్రమాదానికి లోనవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత ఎన్నికల సందర్బంగా తమ పార్టీ ఇచ్చిన 5 గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందన్నారు. గత బీజేపీ సర్కార్ అవినీతికి ప్రయారిటీ ఇచ్చిందే తప్పా ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.
హామీలను అమలు చేయడంలో, ప్రజలకు చేరువ చేయడంలో పార్టీకి చెందిన కార్యకర్తల పాత్ర విస్మరించ లేనిదన్నారు. అందుకే వారికి గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు డీకే శివకుమార్.
కష్టపడి పని చేసిన వారిని పార్టీ తప్పకుండా గుర్తు పెట్టుకుంటుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడైందని సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.