తమిళనాడులో బీజేపీ క్లీన్ స్వీప్
జోష్యం చెప్పిన బీజేపీ చీఫ్ అన్నామలై
తమిళనాడు – రాష్ట్రంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటడం ఖాయమని జోష్యం చెప్పారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తనపై నమ్మకం ఉంచిన పార్టీకి, తమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను ఎల్లవేళలా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు.
శనివారం కె.అన్నామలై మీడియాతో మాట్లాడారు. తనకు కోయంబత్తూరు నుంచి పోటీ చేసేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
తమకు 545 సీట్లకు గాను 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు కే. అన్నామలై. దేశంలోని 143 కోట్ల మంది ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని , సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు కె. అన్నామలై. ఇండియా కూటమికి మరోసారి పరాజయం తప్పదన్నారు. గత కొంత కాలంగా ప్రధానమంత్రి స్వయంగా పలుమార్లు తమిళనాడును సందర్శించారని, పెద్ద ఎత్తున ఆదరణ లభించిందన్నారు.