TELANGANANEWS

సికింద్రాబాద్ బ‌రిలో ప‌ద్మారావు గౌడ్

Share it with your family & friends

మాజీ మంత్రిని ప్ర‌క‌టించిన కేసీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న మాజీ మంత్రి , ప్ర‌స్తుత ఎమ్మెల్యే తిగుళ్ల ప‌ద్మారావు గౌడ్ ను సికింద్రాబాద్ పార్ల‌మెంట్ స్థానానికి త‌మ పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థిగా ఖ‌రారు చేసిన‌ట్లు తెలిపారు. ముందు నుంచీ సౌమ్యుడిగా , ప్ర‌జా నాయ‌కుడిగా గుర్తింపు పొందారు.

గౌడ్ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న ప‌లు ప‌ద‌వుల‌ను నిర్వ‌హించారు. మాజీ మంత్రిగా ఉన్నారు. పిలిస్తే ప‌లికే నాయ‌కుడిగా పేరు పొందారు. ఎవ‌రికి ఏ స‌మ‌యంలోనైనా అవ‌స‌రం వ‌చ్చినా లేదా ఆప‌ద క‌లిగినా తాను ఉన్నాన‌ని భ‌రోసా ఇస్తార‌ని ఇక్క‌డి ప్ర‌జ‌ల న‌మ్మ‌కం.

ఇదిలా ఉండ‌గా ఇవాళ కీల‌క స‌మావేశం జరిగింది. పార్టీ ప‌రంగా ముఖ్య నేత‌ల‌తో పాటు ఎమ్మెల్యేలు, బాధ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా అంద‌రి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కేసీఆర్ ప‌ద్మారావు గౌడ్ వైపు మొగ్గారు. ఆయ‌న అయితేనే పార్టీ ప‌రంగా స‌రైన వ్య‌క్తి అని నమ్మారు. ఇదిలా ఉండ‌గా ఇదే పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొంది ప్ర‌స్తుతం కాంగ్రెస్ లోకి జంప్ అయిన దానం నాగేంద‌ర్ ను ప‌ద్మా రావు గౌడ్ ఢీకొన బోతున్నారు.