మిన్నంటిన ఆప్ ఆందోళన
మంత్రి అతిషిపై ఖాకీల దౌర్జన్యం
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడంపై ఆప్ ఆధ్వర్యంలో ఢిల్లీలో శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. కానీ రాజ్య సభ సభ్యులైన హర్భజన్ సింగ్ , రాఘవ్ చద్దాలు మాత్రం ఎక్కడా కనిపించ లేదు. రాఘవ్ నిన్న ఓ వీడియో సందేశం మాత్రమే ఇచ్చారు.
ఈ సందర్బంగా బలవంతంగా పోలీసులు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీనిపై సీరియస్ అయ్యారు ఆప్ నేతలు. మహిళలను అని చూడకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే ఇలాంటి చవకబారు ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటూ కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు.
ఇదిలా ఉండగా కేవలం కక్ష సాధింపు ధోరణి తప్ప మరొకటి కాదన్నారు మంత్రి అతిషి. ఆమె తన వాయిస్ ను వినిపిస్తూనే వస్తున్నారు. కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదని ఆయన శక్తి అని స్పష్టం చేశారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. కేజ్రీవాల్ బయటకు వచ్చేంత దాకా తమ పోరాటం ఆగదన్నారు.