NEWSTELANGANA

బీఆర్ఎస్ కు య‌శోద రూ. 94 కోట్లు

Share it with your family & friends

కాంగ్రెస్ పార్టీకి రూ. 64 కోట్లు

హైద‌రాబాద్ – సుప్రీంకోర్టు పుణ్య‌మా అని ఒక్క‌టొక్క‌టిగా కంపెనీల బండారం బ‌య‌ట ప‌డుతోంది. ఎల‌క్టోర‌ల్ బాండ్ల పేరుతో తీసుకు వ‌చ్చిన అవినీతి ప‌థ‌కంలో క‌ట్ట‌ల కొద్దీ విరాళాల రూపేణా దేశంలోని రాజ‌కీయ పార్టీలు పొందాయి. ప్ర‌ధానంగా ల‌బ్ది పొందింది మాత్రం మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఆ పార్టీకి ఏకంగా రూ. 6,000 కోట్ల‌కు పైగానే విరాళాలు అందాయి. విచిత్రం ఏమిటంటే కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టు పొందిన మేఘా కృష్ణా రెడ్డి స్వామి భ‌క్తిని చాటుకున్నారు.

ఆయ‌న అత్య‌ధికంగా దొర కేసీఆర్ పార్టీకి స‌మ‌ర్పించుకున్నారు. తాజాగా తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌రో వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన య‌శోద ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ఏకంగా భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి అత్య‌ధికంగా నిధులు ఇచ్చింది.

స‌ద‌రు హాస్పిట‌ల్ మేనేజ్ మెంట్ ఏకంగా బీఆర్ఎస్ కు రూ. 94 కోట్లు స‌మ‌ర్పించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి రూ. 64 కోట్లు ఇవ్వ‌గా , ఆమ్ ఆద్మీ పార్టీకి, జ‌గ‌న్ రెడ్డి పార్టీకి రూ. కోటి చొప్పున విరాళాలు ఇచ్చింది. మొత్తంగా చూస్తే స‌ద‌రు య‌శోద హాస్పిట‌ల్ రూ. 162 కోట్లు విరాళాలు అంద‌జేసింది. అంటే రోగుల నుంచి ఎంత వ‌సూలు చేసిందో అర్థం చేసుకోవ‌చ్చు.