పొన్నం క్లాస్ విద్యార్థులు ఖుష్
కష్టపడి చదివితే సక్సెస్ ఖాయం
కరీంనగర్ జిల్లా – రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ టీచర్ గా మారారు. విద్యార్థులకు బోధన చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లోని ఎస్ఆర్ యూనివర్శిటీని సందర్శించారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
ఈ సందర్బంగా విద్యార్థులతో చాలా సేపు చర్చించారు మంత్రి. జీవితంలో చదువు అత్యంత ముఖ్యమన్నారు. విద్యా పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. తాము చదువు కునేందుకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు.
ఈ సమయంలో మీరంతా చదువు కోవడంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఈ సమయం పోతే మళ్లీ రాదన్నారు. మీ కుటుంబాన్ని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మీరు చదువుకునేందుకు కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
బతుకు ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కూడా మంత్రి క్లాస్ తీసుకున్నారు.