NEWSANDHRA PRADESH

ఏపీలో డ్ర‌గ్స్ మాఫియా

Share it with your family & friends

కంట్రోల్ చేయ‌లేని సీఎం జ‌గ‌న్
అమ‌రావ‌తి – ఏపీలో మాద‌క ద్ర‌వ్యాల హ‌వా కొన‌సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. విశాఖ‌లో భారీ ఎత్తున డ్ర‌గ్స్ కంటెయిన‌ర్లు ప‌ట్టుబ‌డ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గంజాయి మాఫియా ఏపీనే కాదు పొరుగు రాష్ట్రాలైన క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌ల‌కు పాకేలా చేసింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఏపీ దెబ్బ‌కు ప్ర‌మాదంలో ప‌డ్డాయ‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌లోని జ‌గిత్యాల‌లో గంజాయి ముఠా అరెస్ట్ స‌మ‌యంలో వెలుగు చూసిన వాస్త‌వాలు త‌న‌ను నివ్వెర పోయేలా చేశాయ‌ని పేర్కొన్నారు.

విచిత్రం ఏమిటంటే గంజాయి విక్ర‌యిస్తున్న ఈ ముఠాకు విశాఖ లోని పీలేరు నుంచి స‌ర‌ఫరా కావ‌డం దారుణ‌మ‌న్నారు చంద్ర‌బాబు నాయుడు. ఏపీలో గంజాయి అమ్మ‌కాల గురించి పొరుగు రాష్ట్రానికి చెందిన పోలీసులు చెబుతుంటే సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సిగ్గు అనిపించ‌డం లేదా అని నిల‌దీశారు.

దేశంలో ఎక్క‌డ ఏ గంజాయి కేసుకైనా మూలాలు ఏపీలో ఉండ‌టం త‌న‌కు బాధ క‌లుగుతోంద‌న్నారు.
జ‌గ‌న్ పాపాల‌కు ప్ర‌జ‌లే శిక్ష విధిస్తార‌ని జోష్యం చెప్పారు.