కేజ్రీవాల్ ఆలోచనల్ని అరెస్ట్ చేయలేరు
నిప్పులు చెరిగిన సీఎం భగవంత్ మాన్
న్యూఢిల్లీ – ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందన్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీకి చెందిన బాస్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ను కావాలనే అరెస్ట్ చేశారంటూ ధ్వజమెత్తారు మాన్. భగత్ సింగ్ 23 ఏళ్ల ప్రాయంలో దేశం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టారని అన్నారు. కానీ ఇవాళ అమర వీరుల దినోత్సవం రోజు షహీద్ భగత్ సింగ్ , సుఖ్ దేవ్ , రాజ్ గురుల ఆత్మలు ఘోషిస్తున్నాయని అన్నారు సీఎం.
ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందన్నారు. అందుకే మోదీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాచరిక పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు . తమ నాయకుడు , సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయగలిగారు కానీ ఆయన ఆలోచనలను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు.