డేంజర్ జోన్ లో డెమోక్రసీ
యోగేంద్ర యాదవ్ ఆందోళన
న్యూఢిల్లీ – ప్రముఖ సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. కేవలం కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు చోటు చేసుకోవడం అత్యంత ప్రమాదమని హెచ్చరించారు.
ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతోందని వాపోయారు. ఎన్నికల మ్యాచ్ కు ముందు కొత్త ఈసీలను పెట్టి రిఫరీని మార్చారంటూ మండిపడ్డారు యోగేంద్ర యాదవ్. ప్రత్యర్థులకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
30 ఏళ్ల నాటి కేసుల్లో నోటీసులు ఇచ్చారని, సరైన విచారణ జరపకుండా ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు యోగేంద్ర యాదవ్. దమ్ముంటే స్పష్టమైన వివరణ కోరండి. కోర్టు దోషులుగా తేల్చితే ప్రధానమంత్రి అయినా లేదా ఇంకెవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాల్సిందేనంటూ స్పష్టం చేశారు.
ఎన్నికలకు ముందు ఏదో వంకతో ప్రత్యర్థులను అరెస్ట్ చేయడం లేదా స్తంభింప చేయడం , కేసుల్లో ఇరికించడం కక్ష సాధింపు చర్య తప్పా మరొకటి కాదన్నారు యోగేంద్ర యాదవ్. త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు.