సీఎం స్టాలిన్ వైరల్
టీ స్టాల్ వద్ద ప్రత్యక్షం
తమిళనాడు – సోషల్ మీడియాలో వైరల్ గా మారారు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఆయన సీఎంగా కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రజలతో సాధ్యమైనంత మేర కలిసేందుకు ఉత్సుకత చూపించారు.
తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్భాటాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. అంతే కాదు ఆచరణలో చేసి చూపించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏ పని చేయనంటూ ప్రకటించారు. ఎవరి క్యారేజీలు వారే తెచ్చుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు.
ప్రజలకు సేవలు అందించేందుకు మాత్రమే ఉన్నామని , ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని నడుచు కోవాలని పేర్కొన్నారు. వారికి చెప్పే ముందు తను చేసి చూపించాడు. అంతే కాదు ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించ వద్దని ఆదేశించారు. తనకు ఎక్కువ సెక్యూరిటీ అవసరం లేదని స్పష్టం చేశాడు సీఎం ఎంకే స్టాలిన్. బస్సుల్లో సాధారణ ప్రయాణీకుడిగా ప్రయాణం చేశారు. వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి వార్తల్లో నిలిచారు స్టాలిన్. తంజావూరు లోని ఓ స్వీట్ షాపు వద్దకు వెళ్లారు. అక్కడ కూర్చుని టీ తాగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.