NEWSTELANGANA

బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థులు ఖరారు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన పార్టీ బాస్ కేసీఆర్

హైద‌రాబాద్ – పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్. ఇప్ప‌టికే నాగ‌ర్ క‌ర్నూల్, మెద‌క్ జిల్లా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బాస్ ఉన్న‌ట్టుండి కీల‌క‌మైన న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన భువ‌న‌గిరి, న‌ల్ల‌గొండ పార్ల‌మెంట్ స్థానాల‌కు పేర్ల‌ను ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌టించారు.

భువ‌న‌గిరి నుంచి బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన క్యామ మ‌ల్లేశ్ ను, న‌ల్లగొండ లోక్ స‌భ స్థానం నుంచి కంచ‌ర్ల కృష్ణా రెడ్డిని ఖ‌రారు చేశారు కేసీఆర్. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా వివాద ర‌హితుడిగా పేరు పొందిన మాజీ మంత్రి ప‌ద్మారావు గౌడ్ ను ప్ర‌క‌టించారు.

అంద‌రినీ , మిగ‌తా పార్టీల‌ను విస్తు పోయేలా చేశారు. ఇవాళ జ‌రిగిన కీల‌క స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు బీఆర్ఎస్ బాస్. ఈ ఎన్నిక‌లు మ‌న పార్టీకి అత్యంత కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా గెలిచేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఇక ఇటీవ‌లే బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ను నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ అభ్య‌ర్థిగా, మెద‌క్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ ఐఏఎస్ , ఎమ్మెల్సీ ఎల్ . వెంక‌ట్రామి రెడ్డి ల‌ను ఖ‌రారు చేశారు కేసీఆర్.