మోదీపై కోపం సీఏఏపై వ్యతిరేకం
ఆచార్య ప్రమోద్ కృష్ణం
న్యూఢిల్లీ – ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పౌర స్మృతి చట్టం (సీఏఏ) పై తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు కావాలని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. కేవలం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఉన్న వ్యతిరేకతతోనే సీఏఏను గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని అంతకు తప్పించి ఇంకేమీ లేదన్నారు ఆచార్య ప్రమోద కృష్ణ స్వామి.
ఈ దేశంలో అక్రమంగా చొరబాటుదారులు కోట్ల మంది ఉన్నారని , వారు ఎవరెవరో ఎక్కడి నుంచి వచ్చారనే విషయం తెలుసు కోవాల్సిన అవసరం ఈ దేశానికి తప్పక ఉంటుందన్నారు. గతంలో ఏలిన కాంగ్రెస్ పార్టీ దీనిని పట్టించు కోలేదని ఆరోపించారు. కేవలం కాందీశీకులుగా వచ్చి ఇక్కడే స్థిర పడిన వారిని కేవలం ఓటు బ్యాంకుగా చూసిందన్నారు.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మోదీ సీఏఏ చట్టాన్ని తీసుకు రావడం జరిగిందని చెప్పారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు ఆచార్య ప్రమోద్ కృష్ణం.