కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికం
నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ
న్యూఢిల్లీ – రోజు రోజుకు ఈ దేశంలో ప్రశ్నించే గొంతుకలు కనుమరుగై పోతున్నాయోనన్న అనుమానం కలుగుతోందన్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రాజ్య సభ సభ్యురాలు సాగరికా ఘోష్. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయడంపై తీవ్రంగా స్పందించారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే డెమోక్రసీపై జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుందన్నారు సాగరికా ఘోష్. ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఉందా అని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్న మోదీ ప్రభుత్వం చివరకు ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు .
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు సాగరికా ఘోష్. మూడుసార్లు ఎన్నికైన కేజ్రీవాల్ సిట్టింగ్ సీఎం అన్న సోయి లేకుండా ఎలా ఈడీ అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య తప్ప మరోటి కాదన్నారు ఎంపీ.