NEWSTELANGANA

యూట్యూబ్ ఛాన‌ళ్ల‌పై కేటీఆర్ ఫైర్

Share it with your family & friends

ఆధారాలు లేకుండా అబ‌ద్దాలు

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. యూట్యూబ్ ఛాన‌ళ్ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాధ్య‌తా యుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన యూట్యూబ్ ఛాన‌ళ్లు గీత దాటి వ్య‌వ‌హ‌రిస్తున్నాయంటూ మండిప‌డ్డారు. ఆదివారం కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదే పదే ప్రసారం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్దాలను చూపిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు కేటీఆర్.

గుడ్డి వ్యతిరేకత వల్ల‌నో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేర పూరితమైన, చట్టవి రుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేవారు. ఇది వ్యక్తిగతంగా త‌న‌తో పాటు, త‌మ‌ పార్టీని దెబ్బ తీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్య త‌ప్ప ఇంకోటి కాద‌న్నారు.

గతంలో త‌మ పై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయ పరమైన చర్యలు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గ పూరిత, కుట్ర పూరిత చర్యలను చట్ట బద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు.

అసత్యాలను అదే పనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబునెల్స్ తో వార్తల పేరిట ప్ర‌చారానికి పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్ల పైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు కేటీఆర్.