ANDHRA PRADESHNEWS

కూట‌మికి అంత సీన్ లేదు

Share it with your family & friends

మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి

నంద్యాల జిల్లా – రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలతో కూడిన కూట‌మికి అంత సీన్ లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టినా వారు వినే స్థితిలో లేరన్నారు. మ‌రోసారి వైసీపీకి ప‌ట్టం క‌డ‌తార‌ని ధీమా వ్య‌క్తం చేశారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త త‌మ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ద‌క్కుతుంద‌న్నారు బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి.

నంద్యాల జిల్లా డోన్ లో ముస్లిం మైనార్టీలో స‌మావేశం అయ్యారు ఆర్థిక మంత్రి. త‌మ‌పై లేని పోని ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని అన్నారు. పాత ట్యాంకులను పునరుద్ధరిస్తే..రంగులు వేశామంటారా అని మండిప‌డ్డారు. పాడు ఆలోచనలు తప్ప పాలనా ఆలోచనలు తెలియని ప్రతిపక్షాలంటూ మంత్రి చురకలు అంటించారు.

డోన్ నియోజకవర్గంలో సగటు మనిషికి సమగ్ర మౌలిక సదుపాయాలు క‌ల్పించామ‌ని అన్నారు. ఎక్కడా లేని విధంగా నగరవనం, స్విమ్మింగ్ పూల్, క్లబ్, బోటింగ్, టెన్నిస్ కోర్ట్ వసతులు క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి. ఏ ఒక్క‌రు వ‌ల‌స పోకుండా చేశామ‌న్నారు.

తాగు నీరు, సాగు నీరుకు పెద్దపీట వేస్తూ 76 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేప‌ట్టామ‌న్నారు. మరమ్మతుల పేరుతో బిల్లులు తీసుకునే వారికి గన్ గ్రౌటింగ్ టెక్నాలజీ తెలుస్తుందా అని ప్ర‌శ్నించారు.