SPORTS

సంజూ సెన్సేష‌న్ ల‌క్నో ప‌రేషాన్

Share it with your family & friends

3 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో 82 ర‌న్స్

జైపూర్ – మ‌రోసారి స‌త్తా చాటాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. అత‌డికి తోడు రియాన్ ప‌రాగ్ కూడా దంచి కొట్టాడు. ఐపీఎల్ 2024లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు చుక్క‌లు చూపించాడు శాంస‌న్.

52 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న సంజూ శాంస‌న్ 3 ఫోర్లు 6 భారీ సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు . మ‌రో వైపు రియాన్ ప‌రాగ్ 29 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ 3 సిక్స‌ర్ల‌తో 43 ర‌న్స్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 193 ర‌న్స్ చేసింది.

ఇదిలా ఉండ‌గా మ్యాచ్ లో కీల‌క‌మైన భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు సంజూ శాంస‌న్ , రియాన్ ప‌రాగ్ లు. ఈ ఇద్ద‌రు కలిసి 93 ర‌న్స్ చేశారు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్కిప్ప‌ర్ కేఎల్ రాహుల్ ఎంత ప్ర‌య‌త్నం చేసినా లాభం లేక పోయింది. దీంతో భారీ ర‌న్ రేట్ తో పాయింట్ల ప‌ట్టిక‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టాప్ లో నిలిచింది.