బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఖరారు
రాజమండ్రి నుంచి బీజేపీ చీఫ్ పోటీ
అమరావతి – సార్వత్రిక ఎన్నికల వేళ కీలక ప్రకటన చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే 545 స్థానాలకు గాను కనీసం 400 సీట్లలో గ్రాండ్ విక్టరీ నమోదు చేయాలని దిశా నిర్దేశం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు పార్టీ కసరత్తు చేస్తోంది. హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పలు చోట్ల గెలుపు గుర్రాలకే ప్రయారిటీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తాను కోరుకున్నట్లే రాజమండ్రి లోక్ సభ స్థానాన్ని కేటాయించింది. ఈ స్థానానికి భారీ ఎత్తున పోటీ నెలకొన్నా చివరకు ఆమెనే తన పంతం నెగ్గించుకుంది. ఏపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. దీనికి కారణం టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం.
ఏపీలో 6 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో మిగిలి పోయిన 2 స్థానాలకు డిక్లేర్ చేసింది హైకమాండ్. రాజమండ్రి నుంచి పురందేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ , అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి డాక్టర్ వర ప్రసాద్ , నరసాపురం నుంచి శ్రీనివాస శర్మ ను ఖరారు చేసింది .