NEWSTELANGANA

ఫార్మా కంపెనీలు విరాళాలు

Share it with your family & friends

నిబంధ‌న‌లు బేఖాత‌ర్

హైద‌రాబాద్ – ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్య‌వ‌హారం విస్తు పోయేలా చేస్తోంది. సుప్రీంకోర్టు దెబ్బ‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఎవ‌రెవ‌రు, ఏయే సంస్థ‌లు ఎన్నెన్ని నిధుల‌ను రాజ‌కీయ పార్టీల‌కు ఇచ్చార‌నే వివ‌రాల జాబితాను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించింది. మొత్తం బండారం బ‌య‌ట ప‌డింది. దేశంలో అత్య‌ధికంగా విరాళాలు అందుకున్న పార్టీల‌లో బీజేపీ నెంబ‌ర్ వ‌న్ ఉండ‌గా కేసీఆర్ సార‌థ్యంలోని బీఆర్ఎస్ 2వ స్థానంలో నిల‌వ‌డం విశేషం.

విచిత్రం ఏమిటంటే ప‌ర్యావ‌ర‌ణాని పెను ముప్పుగా ప‌రిణ‌మించి, నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్, తెలంగాణ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు నుంచి తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప‌లు ఫార్మా కంపెనీలు గంప గుత్త‌గా బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఎల‌క్టోర‌ల్ బాండ్ల ద్వారా స‌మ‌ర్పించాయి.

హిండీస్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, హాజెలో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 12.5 కోట్ల చొప్పున బీఆర్ఎస్ కు అంద‌జేశాయి విరాళాల‌ను. దివీస్ లేబొరేట‌రీస్ ఎన్జీటీ కేసు ఎదుర్కొంటోంది. స‌ద‌రు సంస్థ ఏకంగా రూ. 20 కోట్లు ఇచ్చింది. హాన‌ర్ ల్యాబ్స్ కూడా గులాబీ పార్టీకి రూ. 20 కోట్లు స‌మ‌ర్పించింది. ఈ కంపెనీల‌తో పాటు నాట్కో, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ , రెడ్డి లేబొరేట‌రీస్ , అర‌బిందో, హెటిరో డ్ర‌గ్స్ వంటి అనేక ఇత‌ర కంపెనీలు బీఆర్ఎస్ కు విరాళాలు స‌మ‌ర్పించాయి.