మోదీ సర్కార్ ఫోన్ హ్యాకింగ్
టీఎంసీ ఎంపీ సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్. ఆమె మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలం నుంచీ ఆమె బీజేపీ సాగిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తప్పు పడుతూ వచ్చారు.
ఈ సందర్బంగా ఇటీవలే ఎంపీగా ప్రమోట్ అయిన సాగరికా ఘోష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన ఫోన్ హ్యాకింగ్ అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు సాగరికా ఘోష్. ఇది పూర్తిగా చట్ట విరుద్దమని పేర్కొన్నారు. తనకు అనుమానం వచ్చి వెంటనే ఎంపీ తాను వాడుతున్న మొబైల్ నెట్ వర్క్ ఎయిర్ టెల్ కంపెనీకి ఫిర్యాదు చేశారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన డివైస్ లో మాల్ వేర్ ఉందని వాపోయారు. గతంలో జర్నలిస్టుగా ఉన్నారు. ఆ తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. తన ఫోన్ ను కావాలని హ్యాక్ చేశారంటూ ఆవేదన చెందారు. దీనికి ప్రధాన కారణం ప్రధాని మోదీనేంటూ సంచలన విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా ఎయిర్ టెల్ టెలికాం కంపెనీ వెంటనే స్పందించింది. ఈ సందర్బంగా కీలక సూచనలు చేసింది ఎంపీ సాగరికా ఘోష్ కు. యాంటీ వైరస్ , యాంటీ స్పై వేర్ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని ఎంపీకి సూచించింది.