ఐదో విడత బీజేపీ లిస్టు రిలీజ్
పార్టీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటన
న్యూఢిల్లీ – సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పార్టీ చీఫ్ జేపీ నడ్డా 545 లోక్ సభ స్థానాలకు గాను ఇప్పటికే నాలుగు విడతులుగా అభ్యర్థుల జాబితాలను ఖరారు చేసింది. ఇదే సమయంలో తాజాగా ఐదో విడత జాబితాను విడుదల చేశారు.
ఊహించని రీతిలో పార్టీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చనీయంశంగా మారుతూ వచ్చిన బాలీవుడ్ కు చెందిన సినీ నటి కంగనా రనౌత్ కు టికెట్ ఖరారు చేసింది. ఆమెకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి బరిలో నిలిపామని పేర్కొన్నారు పార్టీ చీఫ్ జేపీ నడ్డా.
ఇదిలా ఉండగా ఐదో విడతలో మొత్తం 107 మందికి చోటు కల్పించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 25 సీట్లకు గాను అన్నింటిని ఖరారు చేశారు. చివరకు 6 స్థానాలను ప్రకటించింది. ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుంది బీజేపీ.