మానవత్వం చాటుకున్న ముస్లింలు
హనుమాన్ భక్తులకు పండ్లు పంపిణీ
జుక్కల్ – కుల, మత విద్వేషాలతో యావత్ భారత దేశం తల్లడిల్లుతోంది. రాజకీయాల వరకే ద్వేషాలు ఉంటాయని మనుషుల మధ్య అలాంటిది ఏమీ లేదని మానవత్వాన్ని చాటుకున్నారు ముస్లిం సోదరులు. ఈ అరుదైన సన్నివేశానికి వేదికగా మారింది జుక్కల్ మండలం.
ప్రతి ఏటా హనుమాన్ దీక్షను చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. వారంతా పాదయాత్రగా బయలు దేరారు. అసలే ఎండాకాలం కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి కష్టాన్ని గమనించారు ముస్లింలు.
జుక్కల్ మండలంలోని కెంరాజ్ కల్లలి గ్రామం నుంచి మద్నూర్ మండలంలోని సలాబత్కూర్ హనుమాన్ ఆలయం వరకు హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాములు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా లక్షణ గేటు వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ యువ నాయకుడు అజీమ్ పటేల్ ఆధ్వర్యంలో 1,000 మందికి పైగా స్వాములకు , భక్తులకు పండ్లు పంపిణీ చేశారు.
దేశ సంస్కృతి, సమైక్యతను చాటి చెప్పేందుకు మైనార్టీలు, హిందువులు ప్రయత్నం చేయాలని కోరారు. ఈ సందర్బంగా తమకు మైనార్టీ సోదరులు చేసిన సాయానికి ధన్వవాదాలు తెలిపారు.