ఫోన్ ఎక్కడుందో తెలియదు
విచారణలో సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఫోన్ ఎక్కడుందో తెలియదని విచారణలో చెప్పినట్టు సమాచారం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత ను కూడా అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ.
ఇద్దరూ కలిసి మద్యం పాలసీ ముసాయిదాను తయారు చేశారని ఆరోపించింది. కవితతో పాటు కేజ్రీవాల్ కింగ్ పిన్ లుగా మారారని పేర్కొంది. ఇదే విషయాన్ని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో 17 మందిని అరెస్ట్ చేసింది ఈడీ.
ఈ మొత్తం వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. ఇదిలా ఉండగా తమను కక్ష సాధింపు లో భాగంగానే అరెస్ట్ చేశారంటూ వాపోయారు అరవింద్ కేజ్రీవాల్ , కల్వకుంట్ల కవిత. ఇదిలా ఉండగా మార్చి 28 వరకు రిమాండ్ విధించింది కోర్టు .
అయితే విచారణ సందర్బంగా మద్యం పాలసీ సమయంలో వాడిన ఫోన్ ఎక్కడుందని ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్లు టాక్. మొత్తంగా ఎన్నేళ్లు జైల్లో ఉంటారనేది ఇంకా తేలాల్సి ఉంది.