ప్రజా సమస్యలపై ఫోకస్
పాలనలో జగన్ వైఫల్యం
మంగళగిరి – టీడీపీ కూటమి త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఎక్కువగా తాను పోటీ చేయబోయే మంగళిరి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఈ సందర్బంగా ప్రజలను కలుస్తున్నారు. వారితో మమేకమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను వింటున్నారు. తాము పవర్ లోకి వచ్చాక అన్నింటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలోని తాడేపల్లి టౌన్ వాసులతో ముచ్చటించారు. కొంత కాలం మాత్రమే మిగిలి ఉందని తాము విజయం సాధించడం పక్కా అని పేర్కొన్నారు. వైసీపీ సర్కార్ కనీస మౌలిక వసతులను కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. జగన్ రెడ్డికి మూడిందని, ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు నారా లోకేష్.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంగళిగిరి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్దికి సంబంధించి మేధావులు, నేతలు, భావ సారూప్యత కలిగిన వారు పలు సూచనలు చేశారని తెలిపారు .