NEWSNATIONAL

31న ఇండియా మెగా ర్యాలీ

Share it with your family & friends

ప్ర‌క‌టించిన రాఘ‌వ్ చ‌ద్దా

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేయ‌డాన్ని నిర‌సిస్తూ పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీతో కూడిన ఇండియా కూట‌మి ఆధ్వ‌ర్యంలో మార్చి 31న దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో మెగా ర్యాలీ చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆప్ నేత రాఘ‌వ్ చ‌ద్దా.

ఇందులో వామ‌పక్షాల‌తో పాటు కాంగ్రెస్ కూడా పాల్గొంటుంద‌ని చెప్పారు. ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలోని చారిత్రాత్మ‌క రాంలీలా మైదానంలో భారీ బ‌హిరంగ స‌భ ఉంటుంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ర్యాలీకి ల‌క్ష‌లాదిగా దేశం న‌లుమూల‌ల నుంచి త‌ర‌లి వ‌స్తార‌ని తెలిపారు.

ఈ సంద‌ర్బంగా ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మోదీ స‌ర్కార్ క‌క్ష సాధింపున‌కు పాల్ప‌డుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు.

మోదీ రాచ‌రిక పాల‌న సాగిస్తున్నాడ‌ని, దేశంలో ప్ర‌తిప‌క్షాలు లేకుండా చూడాల‌ని చూస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.