కోల్ క‌తా చేతిలో ఓడి పోవ‌డం బాధాక‌రం

భావోద్వేగానికి లోనైన రోహిత్ శ‌ర్మ

కోల్ క‌తా : ఐపీఎల్ మెగా టోర్నీలో త‌మ పేల‌వ‌మైన  ప్ర‌ద‌ర్శ‌న  త‌న‌ను ఎంత‌గానో బాధ ప‌డేలా చేసింద‌న్నాడు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ముంబై తో పాటు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కూడా చేతులెత్తేసింది. అడ‌పా ద‌డ‌పా గెలిచినా ఆ త‌ర్వాత ఆశించిన మేర రాణించ‌లేక పోయింది. దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ ఎందుక‌నో ముంబై ఇండియ‌న్స్ పూర్తిగా నిరాశ‌కు గురి చేసింది.

ఇక మ్యాచ్ ఓడి పోయిన అనంత‌రం మీడియాతో మాట్లాడాడు  రోహిత్ శ‌ర్మ‌. ఇది మాకు మరో నిరాశాజనకమైన సీజన్. ఈ సీజన్ ముంబై ఇండియన్స్‌కు, నాకు కూడా చాలా పేలవంగా సాగింది. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి సీజన్‌లను నేను చాలా అరుదుగా చూశాను. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, జారవిడిచిన క్యాచ్‌లు, ప్రతీదీ సరిగ్గా జరగడం లేదన్నాడు.  అందుకే ఇది చాలా చెడ్డ సీజన్‌గా నిలిచింది. మనం ఈ దశను ఎంత త్వరగా అధిగమిస్తే, మనకు అంత మంచిద‌న్నాడు. చివరి మ్యాచ్ గెలిచి, ఈ టోర్నమెంట్‌ను సానుకూల ముగింపుతో పూర్తి చేస్తామని ఆశిస్తున్నని పేర్కొన్నాడు. 

  • Related Posts

    చెరువుల్లో నీళ్ల‌ను వృధా చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

    ప్ర‌కాశం జిల్లా : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ఆనం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన డీఆర్సీ స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. చెరువులోని చేపలను పట్టుకునేందుకు నీటిని వదిలేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. ప్రస్తుతం ఎల్…

    ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం

    క‌డ‌ప జిల్లా : టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైసిపి హయాంలో ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పార్టీకి అండగా నిలిచింది కార్యకర్తలేన‌ని కొనియాడారు. ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *