నన్నే ఆపుతారా – లోకేష్
డీజీపీపై తీవ్ర ఆగ్రహం
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు తన వాహనాన్ని ఆపుతారంటూ పోలీసులపై మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. వెళ్లిన ప్రతిచోటా పదే పదే ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య రామి రెడ్డి వాహనాన్ని ఆపడం లేదని కానీ కావాలని తన వెహికిల్ ను నిలిపి వేస్తుండడం దారుణమన్నారు.
ఇంతకు రాష్ట్రంలో పాలన అనేది ఉందా అని ప్రశ్నించారు నారా లోకేష్. ఈ వారం రోజుల్లో నాలుగైదు సార్లు తనను ఆపారాని అన్నారు. డీజీపీపై తీవ్ర దూషణలు చేశారు. నాటకాలు ఆడొద్దంటూ ఫైర్ అయ్యారు. తనను నిలిపి వేసిన శ్రీనివాసరావు పోలీస్ పై మండిపడ్డారు.
ఎన్నికల కోడ్ పేరుతో పదే పదే ఆపడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. ఈ విషయంపై తాను కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు నారా లోకేష్. రూల్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండాలన్నారు. ఒకరికి ఒక లాగా మరొకరికి మరో లాగా ఎలా అమలు చేస్తారంటూ ఫైర్ అయ్యారు.