సీటు కోసం పోతిన మహేష్ దీక్ష
విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వాల్సిందే
బెజవాడ – ఏపీలో పొత్తుల పంచాయతీ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా సీట్లను కేటాయించారు. పార్టీ కోసం పని చేసిన కొందరికి సీట్లు దక్కక పోవడంతో పలు చోట్ల ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు కొనసాగుతున్నాయి.
ప్రధానంగా ఇటు టీడీపీలో అటు జనసేన పార్టీలో పెరిగాయి. ఇదిలా ఉండగా తాజాగా జనసేన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ముందు నుంచీ పార్టీ కోసం కష్టపడిన పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తున్నారు.
చివరి వరకు తనకు సీటు వస్తుందని నమ్మకంతో ఉన్నారు. కానీ ఉన్నట్టుండి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో పశ్చిమ సీటు కోల్పోయారు. దీంతో తనకు విజయవాడ పశ్చిమ సీటు కావాలంటూ దీక్ష చేపట్టారు పోతిన మహేష్. కూటమిలో తనకు సీటు రావడమే న్యాయమని అన్నారు. ప్రజా సమస్యలపై ఎన్నో ఏళ్లుగా ఉద్యమం చేశానని చెప్పారు. పవన్ కళ్యాణ్ పై తనకు నమ్మకం ఉందన్నారు పోతిన మహేష్.