మాతృభూమి రుణం తీర్చుకుంటా
ప్రధాన మంత్రి మోదీకి థ్యాంక్స్
హిమాచల్ ప్రదేశ్ – ప్రముఖ వివాదాస్పద బాలీవుడ్ కు చెందిన నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెను సర్ ప్రైజ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని 545 ఎంపీ సీట్లకు సంబంధించి జాబితాలను ప్రకటించింది. ఇప్పటి వరకు నాలుగు విడతలు ప్రకటించగా తాజాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఐదో లిస్టును ఖరారు చేశారు. ఇందులో కంగనాకు చోటు దక్కింది.
ఈ సందర్బంగా హిమాచల్ ప్రదేశ్ కు చేరుకున్న కంగనా రనౌత్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఇవాళ కోట్లాది మంది సంతోషంతో హోళీ పండుగను జరుపుకుంటున్నారు. వీరితో పాటు నేను కూడా పాల్గొంటున్నానని చెప్పారు.
ఇది నా జన్మ భూమి. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నా. నా మాతృభూమి తనను తిరిగి పిలిచిందన్నారు . తనను గెలిపిస్తే మాతృ భూమి రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు కంగనా రనౌత్. తనకు టికెట్ ఇచ్చి బరిలో నిలిపేందుకు ఛాన్స్ ఇచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు.